ఇండోనేషియా భారీ వరదలతో అతలాకుతలమైంది. గతవారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఉత్తర సుమత్రా ప్రావిన్స్‌లో నదులు పొంగిపొర్లాయి. దీంతో వందలాది ఇళ్లు నీటమునిగాయి. ఈ వరదల వల్ల దాదాపు 502 మంది మృతి చెందారు. మృతదేహాలను వెలికితీసేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వందమందికిపైగా గల్లంతయ్యారని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.