NTR: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 17 నెలల్లోనే పెన్షన్ల కోసం రూ.50,763 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుతం 64 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతి నెల రూ.2,751 కోట్లు వారి ఇంటి వద్దకే వెళ్లి చేతికి అందిస్తుందని ఇది దేశంలో ఎక్కడా లేని రికార్డు అని దేవినేని ఉమా అన్నారు. గత ఐదేళ్లు జగన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి కుప్పిగంతులేసిందని ఎద్దేవా చేశారు.