BDK: దమ్మపేట గ్రామ పంచాయతీ అర్బన్ కాలనీ చెరువుకట్ట సమస్యలను పట్టించుకునే వారే లేరని అర్బన్ కాలనీ వాసులు అంటున్నారు. రెండు సంవత్సరాలుగా చెరువుకట్టపై ఉన్న వీధి దీపాలు పనిచేయడం లేదని, చెరువుకట్ట మరమ్మతులకు, అలాగే అక్కడ పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయడానికి కూడా ఎలాంటి చర్యలు లేవని అన్నారు. ఈ సమస్యలు పరిష్కరించే నాయకుడు ఉంటే ఓట్లు అడగడానికి రావాలన్నారు.