BHNG: ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక వికాస్ ఒకేషనల్ పారామెడికల్ కళాశాల అధ్యాపకులు రామక్రిష్ణ, దేవేందర్‌లు అన్నారు. సోమవారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరు ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలించాలన్నారు.