కోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ఎట్టకేలకు మృణాల్ స్పందించింది. అవన్నీ చూస్తుంటే తనకు నవ్వొస్తోందని, ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని కొట్టిపారేసింది. ఇలాంటి తప్పుడు వార్తలు ఎవరు పుట్టిస్తారో అర్థం కావడం లేదని, వాటిని చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని మృణాల్ క్లారిటీ ఇచ్చింది.