NZB: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన కానిస్టేబుల్ కిష్టయ్య త్యాగం చిరస్మరణీయమని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం కానిస్టేబుల్ కిష్టయ్య వర్ధంతి సందర్భంగా బాన్సువాడలోని కిష్టయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ముదిరాజ్ సంఘ నాయకులు పాల్గొన్నారు.