రాజ్ నిడిమోరుతో పెళ్లి వార్తలపై సమంత క్లారిటీ ఇచ్చింది. ఇన్స్టా వేదికగా వారి పెళ్లి ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఇవాళ ఉదయం తమిళనాడులోని ఈషా యోగా సెంటర్లోని లింగభైరవి ఆలయంలో వారికి వివాహం జరిగిన విషయం తెలిసిందే. కాగా, పెళ్లి వేడుకలో సామ్ ఎరుపు రంగు చీరలో మెరిసింది.