MBNR: పాలమూరు యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన క్యాంటీన్‌ను సోమవారం ఉపకులపతి ఆచార్య జీ.ఎన్. శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం ఆయన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్యాంటీన్ ద్వారా సిబ్బందికి ఆహార సదుపాయాలు మరింత సులభతరం అవుతాయని వీసీ అన్నారు. క్యాంపస్ అభివృద్ధి కోసం మరిన్ని చర్యలు కొనసాగుతాయని తెలిపారు.