BHPL: తెలంగాణ రాష్ట్రానికి KCR పాలన శ్రీరామరక్ష అని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. టేకుమట్ల మండలం రామకృష్ణాపూర్ (టీ) గ్రామానికి చెందిన పలువురు సోమవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ నుంచి BRSలో చేరారు. వీరికి గండ్ర గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో BRS అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలన్నారు.