‘పార్లమెంట్లో డ్రామాలు వద్దు’ అని ప్రధాని మోదీ చేసిన కామెంట్స్ కు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ గట్టి కౌంటర్ ఇచ్చారు. కాలుష్యం, SIR లాంటి సీరియస్ సమస్యలపై మాట్లాడితే డ్రామా అంటారా? అని నిలదీశారు. అసలు పార్లమెంట్ ఉన్నదే చర్చించడానికి.. ఆ చర్చ జరగనివ్వకుండా అడ్డుకోవడమే నిజమైన డ్రామా అని మోదీకి చురకలు అంటించారు. ప్రజా సమస్యలు మాకు డ్రామా కాదని తేల్చిచెప్పారు.