ప్రకాశం: : ఎయిడ్స్ పట్ల అవగాహనతోనే ఈ వ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించగలమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా సోమవారం ఒంగోలులో జిల్లా ఎయిడ్స్ నివారణ విభాగ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. మంత్రితోఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కలెక్టర్ రాజాబాబు, స్థానిక ఎమ్మెల్యే రామచర్ల జనార్ధన్ ఉన్నారు.