AP: సుప్రీంకోర్టులో లిక్కర్ కేసు విచారణ జరిగింది. రెగ్యులర్ బెయిల్ కోసం వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సుప్రీంను ఆశ్రయించారు. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం తరపు న్యాయవాది 2 వారాల గడువు కోరారు. దీంతో జనవరి 19వ తేదీకి విచారణ వాయిదా వేస్తూ సుప్రీం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ప్రస్తుతం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మధ్యంతర బెయిల్పై ఉన్నారు.