CTR: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లను ఇస్తోందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో టీడీపీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్సీ లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి నూతన పెన్షన్లను అందజేశారు. సంక్షేమ పథకాలకు అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని చెప్పారు.