మంచిర్యాల జిల్లాలో 73 వైన్ షాపులకు సోమవారం నుంచి 2025-27 సంవత్సరానికి సంబంధించిన నూతన మద్యం పాలసీ అమలు అయింది. డిసెంబర్ 17 వరకు ఎన్నికల కోలాహలం, జనవరి తొలి వారం సెలబ్రేషన్స్‌తో పాటు జనవరి చివరిలో సమ్మక్క సారలమ్మ జాతర అమ్మకాలు అబ్కారీ శాఖకు భారీ ఆదాయాన్ని సమకూర్చనున్నాయి. దీంతో కొత్త షాపులు రాబోయే 3 నెలల పాటు భారీ అమ్మకాలతో కళకళలాడనున్నాయి.