WNP: అమరచింత మండలం చింతారెడ్డిపల్లి గ్రామ ప్రజలు రామేశ్వరమ్మను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఈర్లదిన్నెలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో ఆమె ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో రామేశ్వరమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఆమె వెంట పార్టీ శ్రేణులు, తదితరులు ఉన్నారు.