సత్యసాయి: పెనుకొండ మండలం అడదాకులపల్లి గ్రామ సమీపాన జరుగుతున్న రోడ్డు పనులను మంత్రి సవిత ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో ముచ్చటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి అంటే చెప్పడం కాదు, చేసి చూపించడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. గతంలో రోడ్డు గుంతలు మయంగా మారాయని, వాహనదారుల సౌకర్యార్థం రోడ్లు వేస్తున్నట్లు తెలిపారు.