ADB: సర్పంచ్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని గ్రామ పంచాయతీ రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు వెంకన్న సూచించారు. సోమవారం తాంసి మండలంలోని కప్పర్ల, తాంసి, బండల్ నాగపూర్ క్లస్టర్ల నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. గ్రామ పంచాయితీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ వివరాలు అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. ఆయనతో పాటు ఎంపీడీఓ మోహన్ రెడ్డి, తదితరులున్నారు.