ATP: గుత్తి పట్టణంలోని లచ్చనపల్లి జగనన్న లేఔట్లో గత వైసీపీ ప్రభుత్వంలో ఇంటి పట్టాను మంజూరు చేశారు. ఇచ్చిన ఇంటి పట్టాకు స్థలాన్ని చూపించాలని కోరుతూ బాధితుడు మహబూబ్ బాషా సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వినతిపత్రం అందజేశారు. తహసీల్దార్ పుణ్యవతి మాట్లాడుతూ.. అధికారులతో విచారణ జరిపి న్యాయం చేస్తామన్నారు.