KDP: కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని టీడీపీ మహిళా నాయకురాలు కోటపాటి సుబ్బమ్మ అన్నారు. సిద్ధవటం మండలం మల్లేశ్వరపురం గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.ఇంటింటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ మొత్తాన్ని పెంచినట్లు గుర్తు చేశారు.డ్వాక్రా సంఘాలను ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సహిస్తుందని చెప్పారు.