పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు, శివపల్లిలోని తన నివాసంలో సోమవారం సుల్తానాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుచుటకు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్క కార్యకర్త సైనికునివలె పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.