TG: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు నేతృత్వంలో పార్టీ ప్రతినిధుల బృందం గవర్నర్ను కలిసింది. హిల్ట్ పాలసీ పేరుతో రూ.వేల కోట్ల కుంభకోణం జరుగుతోందని ఫిర్యాదు చేసింది. గవర్నర్ను కలిసిన వారిలో బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్, ఎన్వీ సుభాష్ తదితరులు ఉన్నారు.