SRCL: రుద్రంగి మండల చెక్పోస్ట్ వద్ద వేములవాడ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వాహనాన్ని అధికారులు తనిఖీ చేశారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో ఆది శ్రీనివాస్ వాహనాన్ని అధికారులు ఆపి క్షుణ్ణంగా చెక్ చేశారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం వాహనాల తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు.