MNCL: ధాన్యంలో 15% తేమ ఉండేలా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని జన్నారం మండలంలోని పోన్కల్ క్లస్టర్ ఏఈఓ త్రిసంధ్య సూచించారు. సోమవారం జన్నారం గ్రామంలో ఐకెపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు. అలాగే ధాన్యాన్ని అమ్మేందుకు వ్యవసాయ శాఖ ఇచ్చే టోకెన్లు కూడా తీసుకోవాలని ఆమె కోరారు.