TG: హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు స్పెషల్ డ్రంక్ & డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. వీకెండ్ కావడంతో 1000కి పైగా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ 552, సైబరాబాద్లో 431 కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. మద్యం సేవించి డ్రైవ్ చేస్తే BNS 304 సెక్షన్ కింద కేసు నమోదవుతుంది. గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు.