ATP: చెన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లి గ్రామంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే పరిటాల సునీత ఈ కార్యక్రమంలో పాల్గొని, లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకటో తేదీనే పెన్షన్ అందిస్తున్న ప్రభుత్వం తమ కూటమి ప్రభుత్వమేనని ఆమె పేర్కొన్నారు.