VZM: రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న పేదల అభివృద్ది వైపే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. సోమవారం ఎస్.కోట మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు.ఆనంతరం గ్రామంలో నెలకొన్న సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకొని, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.