E.G: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమంలో భాగంగా దేవరపల్లి మండలం కృష్ణంపాలెంలో గ్రామ టీడీపీ ఉపాధ్యక్షులు బిక్కిన ఏడుకొండలు సోమవారం పంపిణీ చేశారు. ఉదయమే ఇంటింటికి వెళ్లి అర్హులైన లబ్దిదారులకు, కొత్తగా మంజూరైనా వారికి డిసెంబర్ నెల పెన్షన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సర్వేయర్ సావిత్రి, టీడీపీ గ్రామ జనరల్ సెక్రటరీ వాసు పాల్గొన్నారు.