ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని మిట్టపాలెం నారాయణ స్వామి వారి ఆదివారం ఆదాయం రూ.1,96,327 లు వచ్చినట్లు ఈవో నరసింహ బాబు సోమవారం తెలిపారు. అందులో దర్శన టికెట్ల అమ్మకం ద్వారా రూ.48,430లు, ప్రసాదం విక్రయం ద్వారా రూ.22,630లు, అన్నదానానికి విరాళాల ద్వారా రూ.105,729లు, పంచామృత అభిషేకానికి, రూ.16,548, స్వామివారి శ్రీపాద కానుకల ద్వారా రూ.3000లు ఆదాయం వచ్చిందన్నారు.