ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఇవాళ రాజ్యసభకు అధ్యక్షత వహించారు. ఆయన ఛైర్లో కూర్చోవడం ఇదే మొదటిసారి గమనార్హం. దీంతో ఆయన సభను ఎలా నడిపిస్తారోనని అంతా ఆసక్తిగా గమనించారు. ఈ అరుదైన సందర్భంగా అన్ని పార్టీల నేతలు, ఎంపీలు ఆయనకు అభినందనలు చెప్పారు. కొత్త బాధ్యతలో రాధాకృష్ణన్ సభను ప్రారంభించారు.