NLG: కేతేపల్లి మండలం కొత్తపేటకు చెందిన పల్నాటి నారాయణ రెడ్డి అనారోగ్యంతో సోమవారం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం వారి స్వగ్రామానికి వెళ్లి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, పార్టీ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.