పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే.. ఇటీవల మరణించిన సభ్యులకు లోక్సభ సంతాపం తెలిపింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని సభ్యులందరూ కాసేపు మౌనం పాటించి నివాళులు అర్పించారు. మరణించిన నేతలు దేశానికి చేసిన సేవలను స్పీకర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. సంతాప తీర్మానం తర్వాత సభా కార్యక్రమాలు ముందుకు సాగాయి.