KMM: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు సులభంగా ఎన్నికల సమాచారం అందించేందుకు ప్రభుత్వం టీ-పోల్ మొబైల్ యాప్ను రూపొందించింది. ఖమ్మం జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వివరాలు, ఓటర్ స్లిప్పులు, ఎన్నికల నిర్వహణలో ఫిర్యాదు చేయడానికి ఈ యాప్ సాయపడుతుంది. గూగుల్ ప్లేస్టోర్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు ఓటర్లకు సూచిస్తున్నారు.