HYD: రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఇందిరా మహిళా శక్తి పథకంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అయితే.. ప్రస్తుతం సెల్ఫ్ హెల్ప్ గ్రూపు మహిళలు (SHG) కోటి మంది లేరు. ఈ నేపథ్యంలో నూతన సంఘాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 60 వేల సంఘాలు ఏర్పాటు కానున్నాయి.