కృష్ణా జిల్లా ఉయ్యూరులో బొల్లా నాని అనే యువకుడు తన తల్లి పై ఉన్న అపారమైన ప్రేమను చాటుకున్నారు. తల్లి అనారోగ్యంతో మరణించగా, ఆమె అంత్యక్రియలను ₹5 లక్షల ఖర్చుతో, ఒక పెళ్లి వాతావరణంలా నిర్వహించారు. మూడు ట్రక్కుల పూలు, మూడు ట్రక్కుల బాణాసంచాతో కనీవినీ ఎరుగని రీతిలో, బరియల్ గ్రౌండ్ వరకు రోడ్లు మొత్తం పూలమయంగా చేసి తల్లి అంతిమయాత్రను పూర్తిచేశారు.