పార్లమెంట్ సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అర్థవంతమైన చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నానని తెలిపారు. సమస్యలు ప్రస్తావించేందుకు చాలామంది ఎంపీలకు అవకాశం దక్కడం లేదన్నారు. తొలిసారి సభలో అడుగుపెట్టిన వారికి అవకాశం ఇవ్వాలని సూచించారు. డ్రామాలు చేసేందుకు ఎన్నో వేదికలు ఉంటాయని, ఇక్కడ డ్రామాలు చేయొద్దని హెచ్చరించారు.