ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రేపు అండర్19 హ్యాండ్బాల్ ఎంపికలు జరగనున్నాయి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో బాల, బాలికలకు హ్యాండ్బాల్ ఎంపికలను ఈనెల 2న మహబూబ్ నగర్లోని డీఎస్ఏ స్టేడియం గ్రౌండ్స్ నిర్వహిస్తున్నట్లు సోమవారం కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి తెలిపారు. క్రీడాకారులు ఒరిజినల్ టెన్త్ మెమో, బోనఫైడ్, ఆధార్ పత్రాలు తీసుకొని ఉదయం 9 గంటలలోపు పీడీకు రిపోర్ట్ చేయాలన్నారు.