ఖమ్మం జిల్లాలో ఈరోజు నుంచి నూతన ఎక్సైజ్ పాలసీ కింద 116 వైన్స్ ప్రారంభం కానున్నాయి. అయితే, జనావాసాల్లో షాపుల ఏర్పాటుపై స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరాలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో జమ్మిబండ వైన్స్ రద్దు కాగా, మరికొన్నింటిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.