పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడీవేడిగా మొదలయ్యాయి. తొలిరోజే లోక్సభలో ‘SIR’ (ఓటర్ల జాబితా సవరణ), ఢిల్లీ పేలుడు ఘటన అంశాలపై కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. మిగతా పనులన్నీ పక్కనపెట్టి.. దీనిపైనే తక్షణం చర్చించాలని పట్టుబట్టారు. దీంతో సభలో ఒక్కసారిగా హీట్ పెరిగింది. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిందేనని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.