కృష్ణా: సెల్ ఫోన్ విషయంలో తలెత్తిన వివాదం చివరకు ఓ యువకుడి ప్రాణం తీసింది. తిరువూరు మండలం తొకపల్లికి చెందిన మనోజ్ కుమార్ (18)పై 6 రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ఇటుక రాయితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మనోజ్ కుమార్ విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి కన్నుమూశాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.