TG: ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్ లేఖ రాశారు. మహిళా సమాఖ్యల ద్వారా నిర్వహించేందుకు వీలుగా మరో 448 అద్దె బస్సుల కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారు. అవసరమైన ప్రభుత్వ అనుమతులు మంజూరైన వెంటనే, ఈ కొత్త బస్సులను ఆర్టీసీకి అప్పగిస్తామని వెల్లడించారు. మహిళలకు స్థిరమైన ఆదాయ మార్గాలను కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తుంది.