JGL: గొల్లపల్లి మండలం మల్లన్నపేటలో జరుగుతున్న శ్రీ దొంగ మల్లన్న జాతరలో అక్రమ గ్యాంబ్లింగ్ జరుగుతున్నట్లు తెలిసి గొల్లపల్లి ఎస్సై ఎం. కృష్ణసాగర్ రెడ్డి దాడి నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన ఆరిఫ్ పాషా S/o మహమ్మద్ చాంద్ పాషా అందర్–బహార్ గ్యాంబ్లింగ్ ఆడుతున్నాడని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 4,000 నగదు, బెట్టింగ్ టోకెన్స్ స్వాధీనం చేసుకునట్లు ఎస్సై తెలిపారు.