విశాఖ జిల్లా పరిషత్‌లో ప్రపంచ ఎయిడ్స్ నిర్మూలనా దినోత్సవం సోమవారం నిర్వహించారు. ఎయిడ్స్ బాధిత చిన్నారులతో కలెక్టర్ MN హరేంద్ర ప్రసాద్ అల్పాహారం చేసి వారి చదువు, యోగక్షేమాలు తెలుసుకున్నారు. వైద్య శాఖ ఏర్పాటు చేసిన అవగాహనా ఎగ్జిబిషన్‌ను ప్రారంభించి, బాధిత మహిళలకు స్వయం ఉపాధి కోసం కుట్టుమిషన్లు పంపిణీ చేశారు.