MBNR: స్థానిక సంస్థల ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వెంటే ఉంటాయని జిల్లా దేవరకద్ర శాసనసభ్యులు జి.మధుసూదన్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిందని ఆయన తెలిపారు. వీటితో పాటు, ఇంటింటికి సన్న బియ్యం అందిస్తుండడం కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పాలనకు నిదర్శనం అన్నారు.