MHBD: నెల్లికుదురు మండలం పార్వతమ్మ గూడెంలో సర్పంచ్ స్థానం జనరల్ రిజర్వేషన్ కావడంతో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎదల్ల యాదవ రెడ్డి మాతృమూర్తి పూలమ్మ(70)ను బరిలో నిలిపారు. ఈమెకు వ్యతిరేకంగా ఒక నామినేషన్ కూడా రాకపోవడంతో ఏకగ్రీవం అయింది. కానీ డిసెంబర్ 3న అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు. పూలమ్మ ఏకగ్రీవం కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.