నేషనల్ హెరాల్డ్ కొత్త FIRపై సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ నిప్పులు చెరిగారు. ఇది హెరాల్డ్ కేసు కాదు.. నేషనల్ ‘హరాస్మెంట్’ కేసు అని మండిపడ్డారు. అందులో క్రైమ్ లేదు, క్యాష్ లేదు.. అయినా ఈడీకి మనీ లాండరింగ్ కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఈడీకి ఒకవైపు మాత్రమే కనిపిస్తోందని.. పగ, ప్రతీకారంలో బీజేపీకి గోల్డ్ మెడల్ ఇవ్వొచ్చని సెటైర్లు వేశారు.