TG: మేడారం జాతరలో ట్రాఫిక్ నియంత్రణకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. గట్టమ్మ దేవాలయం వద్ద ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. తాత్కాలిక రోడ్డు నిర్మాణం, వాహనాల పార్కింగ్‌పై అధికారులు, పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. కాగా, జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు ప్రధాన ఘట్టం జరగనుంది. జాతరకు భారీగా భక్తులు తరలొచ్చే అవకాశం ఉంది.