గుంటూరు: తాడేపల్లి నవోదయ కాలనీలో ఆదివారం మాధురి అనే వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె 2025లో రాజేష్ నాయుడుతో కులాంతర వివాహం చేసుకుంది. అయితే, భర్త వేధింపుల వల్లే ఆమె బలవన్మరణానికి పాల్పడిందని బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించి, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.