కనిగిరిలో స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి 30వ వర్థంతి సందర్భంగా సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ఆయన విగ్రహానికి పూల మాలలు వేస్తూ ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కనిగిరి ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిన ప్రజానేత పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక TDP నాయకులు తదితరులు పాల్గొన్నారు.