AP: విశాఖ కైలాసగిరిపై ఐకానిక్ స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జిని ఎంపీ శ్రీభరత్ ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి వైజాగ్ టూరిస్టులకు కొత్త అనుభవం పరిచయం కానుంది. భారతదేశంలోనే పొడవైన కాంటిలివర్డ్ నిర్మాణంలో గ్లాస్ బ్రిడ్జ్‌గా గుర్తింపు రానుంది. రూ.7 కోట్లతో నిర్మించిన ఈ గ్లాస్ స్కైవాక్ పొడవు 55 మీటర్లు ఉంది. దీనిపై ఒకేసారి 40 మంది సందర్శకులు వెళ్లే ఛాన్స్ ఉంటుంది.