MBNR: ఉమ్మడి జిల్లా పరిధిలోని డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ పరీక్షల ఫీజును డిసెంబర్ 27లోగా ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. ఈ పరీక్షలు 2026 ఫిబ్రవరి 7 నుంచి 28 వరకు జరుగుతాయని మహబూబ్ నగర్ వర్సిటీ కో-ఆర్డినేటర్ డాక్టర్ జి.సత్యనారాయణ గౌడ్ తెలిపారు.